 దొంగ ఓటు...ఈ మాట రాజకీయనేతలందరికీ తెలిసిందే. రాజకీయాల్లో నోట్ల సంగతేమోగానీ.. దొంగ ఓట్లతో అధికారాన్ని హస్తగతం చేసుకోవచ్చని మా ఊరి రాజకీయాలను చూసి తెలుసుకున్నాను. అది ఎన్టీఆర్ టైమ్. మా ఊరు ఎమ్మెల్యే, ఎంపీ అందరూ ఎన్టీఆర్ పార్టీ( తెలుగుదేశం)కి చెందిన వాళ్లే. ... మరింత చదువు...
|
 పిల్లల్ని చూస్కోడానికి టైం ఎక్కడుంటుందండీ... ఉదయాన్నే ఆఫీసుకు పరుగెత్తాలి... ఆ తర్వాత ఇంటికెళ్లేసరికి పదో పదకొండో అవుతుంది. ఇక తీరికెక్కడిదీ... ఆదివారం పెండింగ్ పనులకు సరిపోతోంది. ఇక పిల్లల్ని పట్టించుకునే తీరికెక్కడిదీ... ఇదే టైపు సమాధానం మన భారతదేశంలో ... మరింత చదువు...
|
ఈ పాట ఎన్ని వేలసార్లు మా ఊరు చుట్టు ప్రక్కల మారుమోగిందో నాకైతే గుర్తులేదు. మొత్తమ్మీద మారెమ్మ తిరునాళ్లు వచ్చాయంటే ప్రతి పోటాపోటీగా ప్రభలు కట్టి... ఆ ప్రభ వెనక మహా దర్పంగా సదరు ఊరు తరలి వచ్చేది. ఇక ప్రభను రూపొందించన విధానాన్ని... ప్రభపై అమ్మవారి రూపాన్ని ... మరింత చదువు...
|
రోజులానే ఆ ఆదివారం మొద్దు నిద్దుర నుంచి లేచాను. ఆదివారం కదా... నన్నెవరూ కదిలించకండి అని మళ్లీ ముసుగుతన్నాను. పావుగంట గడిచిందో లేదో... పెద్ద రాయి నీళ్లలో పడినట్లు చప్పుడు. ఆ తర్వాత కుక్కపిల్ల ఆర్తనాదాలు. ముసుగుతీసి నిద్రకళ్లతో కుక్కపిల్ల మూలుగు వినబడుతున్న ... మరింత చదువు...
|
ఎటు చూసినా ఫెన్సింగ్... సున్నం కొట్టిన హద్దు రాళ్లతో మా ఊరు పొలాలు ఇళ్ల స్థలాలుగా మారిపోయాయి. ఎకరా 70 వేలంటే ఒకనాడు పెదవి విరిచిన జనం... ఇప్పుడు 30 నుంచి 50 లక్షలకు కొనేందుకు ముందుకొస్తున్నారు. ప్రత్యేక తెలంగాణా పుణ్యమా అని రియల్ వ్యాపారులు ఇప్పుడు దక్షిణ ... మరింత చదువు...
|
ఇప్పుడు ప్రపంచం అత్యంత వేగంగా పరిగెడుతోంది. ప్రపంచంలోని ప్రతి దేశం మొదలుకుని ఆ దేశంలో నివశించే ప్రతి పౌరుడూ నేడు నిరంతర శ్రమ జీవిగా బతుకు వెళ్లదీస్తున్నారు. ఎందుకా శ్రమ...అంటే చలనం లేనట్టు వున్న జీవి జీవించివున్నా నిర్జీవే అనీ... పోటీపడి పనిచేయని పౌరుడు ... మరింత చదువు...
|
డబ్బుతో బతుకువెళ్లదీసుకునే నిరుపేదలు. తామూ ధనికుల్లా సౌకర్యవంతమైన జీవితం గడపాలని కోరుకున్నారు. కావలసినంత సంపాదన చేతికందాలంటే విదేశాలకు తరలివెళ్లటమే మార్గంగా ఎంచుకున్నారు. ఐతే విదేశాలకు వెళ్లే మార్గం... అన్న వీరి ఆలోచనను క్యాష్ చేసుకున్నాడో బ్రోకర్. ... మరింత చదువు...
|
మొన్న తెలంగాణా జిల్లాల్లో జరిగిన ఉపఎన్నికలలో తెలంగాణా రాష్ట్ర సమితి చతికిల పడింది. ఆ పార్టీ వెల్లకిలా పడటంతో మా ఊరులో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే ఒకాయన ఓ ఆటో రిక్షాకు సరిపడే టపాసులను ఊరంతా దద్దరిల్లేలా కాల్చిపారేశాడు. ఇంతకీ అంతట ఆనందం ఎందుకయా అంటే.... ఆయన భూ వ్యాపారం చేసేది రాష్ట్ర రాజధాని హైదరాబాదులో మరి. మరింత చదువు...
|
అమెరికా అధ్యక్షులు జార్జ్ బుష్ భారతీయ మధ్యతరగతి ఆర్థిక స్థాయి పెరిగిందనీ... ప్రపంచవ్యాప్తంగా ధరల పెరుగుదలకు ఇదే కారణమైందనీ అన్నారు. ఈ మాటతో ఆయన సరిపుచ్చుకోలేదు... భారతీయ ప్రజ తెగ తింటున్నారని సెలవిచ్చారు. అయితే భారతదేశంలో కడుపారా మూడుపూట్లా భోజనం అందని దయనీయ స్థితిలో ఉన్న పేదవాళ్లను ఆయన చూస్తేగా మరీ... మరింత చదువు...
|
కోపం కూడా అహంకారం లాంటిదే అనవచ్చు. ఇది మనిషిని తనను తాను మరిచిపోయేట్లు చేస్తుంది. తనను మరిచిన మానవుడు చేసే పనులన్నీ చేయకూడనివై వుంటాయి. ఏమాటలైతే అనకూడదో వాటినే అంటుంటాడు. ఇలా కోపం మనిషిని సంఘంలో పనికిరానివాడిగా చేస్తుంది. మరింత చదువు...
|
'అబ్బియ్యో యాడకి పోతుండావ్' అనే మాటతో అన్ని ఆలోచనలకు ఫుల్‌స్టాప్ పెట్టి ఇహలోకంలోకి వచ్చిపడ్డాను. వెనక్కి తిరిగి... 'ఎవర్నువ్వు నాకు తెలీదే...' అన్నాను.. ఆ మాట పూర్తవకమునుపే అతను... 'ఓర్ని కడుపు సల్లగుండ... నా పేరు వార్నాగడు. మీ పాలెంలో నేనంటే ఎవుళ్లో దెలవందీ నువ్వొక్క మడిసివే. పంతులుగోరు... మూడో అబ్బియ్యివుగదూ...' అన్నాడు.
'అవును' అన్నాను
'పొద్దుటేల ఇట్టా బైదెల్లినావ్... యెవురింటికేంది...' అన్నాడు నాగడు. మరింత చదువు...
|
తెల్లార్లూ పనీపాటుతో అలసిపోయిన శరీరాలు... అంతకుమించి రేపటి పరిస్థితి ఏమిటోనన్న ఆందోళన మిళతమై అనునిత్యం బతుకుపోరు గుండంలోపడి గడిచిపోతుంది నగర జీవనం. నగర జీవితం ఇలా ఉంటే మా ఊరు మాత్రం రాత్రి 8 గంటలకే నిద్దురోతుంది. వేకువ జామున కోడికూసే కూతతోకాక ఐదింటికి పాలడైరీ క్యానులు చేసే మోతతో మా ఊరు మేలుకుంటుంది. అన్నట్లు పోలిరెడ్డి సంగతి చెప్పనేలేదు కదూ...
బహుశా నేను ఐదో తరగతి చదువుతున్న రోజులు అనుకుంటాను... మా నాన్న ఉదయాన్నే నిద్రలేపారు. నేను లేచేసరికి మా ఇంటికెదురుగా ఉన్న నేరేడు చెట్టు వద్దకెళ్లి ఓ పుల్లను విరిచి నోట్లో వేసుకుని నమిలి పళ్లు తోముతున్నాడు. కళ్లు నులుముకుంటూ మా నాన్న దగ్గరికెళ్లి సంగతేమిటని అడిగాను. మరింత చదువు...
|
శోభన్ బాబు అంతిమ వీడ్కోలుకు హాజరై ఆయనకు నివాళులర్పించటానికి మా ఊరు నుంచి ఆయన వీరాభిమాని వచ్చాడు. చెన్నై సెంట్రల్ స్టేషనులో దిగిందే తడవుగా తన అభిమాన నటుడిని విగతజీవుడుగా చూడాల్సిరావటంపై తన దుఃఖాన్ని ఆపుకోలేక మిత్రులకు ఫోనులు చేసి మరీ బాధపడటం మొదలుపెట్టాడు. ఆ మిత్రులలోని ఒక మిత్రుని ద్వారా నా చిరునామా కనుక్కుని నాకూ ఫోన్ చేశాడు. "ఎంత దారుణం జరిగిందో చూశావురా అబ్బాయ్... శోభన్ బాబు చనిపోవటాన్ని నేను మర్చిపోలేకపోతున్నా...". అంటూ ఫోనులోనే భోరున విలపించాడు. అతని అభిమానానికి హ్యాట్సాఫ్... అవునూ... ఇంతకీ ఇతను గురించి మీకు చెప్పలేదుకదూ.... మరింత చదువు...
|
వానాకాలం.... శీతాకాలం... ఈ రెండూ కాలాలకంటే వేసవికాలం ప్రారంభంలో మా ఊరు మహా నిశ్శబ్దంగా ఉంటుంది. చిరుగాలికి చెట్ల కొమ్మలు చేసే సవ్వడి సైతం స్పష్టంగా వినబడుతుంది. వేరుశనగ చేల పీకుళ్లు ముగిసి... కాయల కళ్లాల వద్ద మా ఊరి రైతులు రాత్రుళ్లు కాపలా కాసే రోజులవి. మరింత చదువు...
|
ఆ రోజు ఇప్పటికీ గుర్తే... నేను, మా అక్కయ్య మా శనగ పంట చేనువైపు దారితీశాం. ఉదయం 8 గంటలు కావస్తోంది. శనగ చెట్లఆకులపై తేలియాడుతున్న మంచు బిందువులను సూర్యకిరణాలు సోకి కళ్లముందు ఇంద్ర ధనుస్సును ఆవిష్కృతం చేస్తున్నాయి. పసుపుపచ్చని మైలపూతతో నవ్వుతూ పలుకరిస్తున్న శనగచేలను చూస్తూ మా పొలానికి చేరుకున్నాం. మరింత చదువు...
|